Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కలియుగ వైకుంఠం మట్టి అమరావతికి: ముఖ్యమంత్రి చంద్రబాబు

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేవుళ్ల ఆశీస్సులతో అద్భుతమైన మహానగరాన్ని నిర్మిస్తామన్నారు. కలియుగ వైకుంఠం మట్టిని అమరావతికి పంపుతున్నామన్నారు. మొత్తం 7 పవిత్ర తీర్థాల జలాలను అక్కడికి పంపనున్నట్లు చంద్రబాబు చెప్పారు. కాగా, పాపవినాశనం, కపిలతీర్థం తదితర తీర్థాల నీటిని సేకరించే పనిలో సంబంధిత శాఖాధికారులు నిమగ్నమయ్యారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం కోసం ఇప్పటికే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల నుంచి నీరు, మట్టి సేకరించిన విషయం తెలిసిందే.

More Telugu News